Header Banner

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

  Mon Mar 10, 2025 08:00        Politics

రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం దాదాపుగా ఖరారయింది. ఒకటి రెండు రోజుల్లో బిడ్ల పరిశీలనతో పాటు కాంట్రాక్టర్లతో లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌వోఏ) పూర్తవనుంది. ఆ ప్రక్రియ పూర్తయితే ఈ నెలాఖరు నాటికి పనులు పునఃప్రారంభం కానున్నాయి. వైసీపీ సర్కారు హయాంలో ఐదేళ్ల క్రితం ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించినట్లవుతుంది. పనుల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
62 పనులకు టెండర్లు
అమరావతిలో 90 పనులు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 73 పనులకు పరిపాలనా ఆమోదం తెలిపింది. అందుకోసం రూ.48వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇప్పటికే రూ.40,000 కోట్ల విలువైన 62 పనులకు ఈ ఏడాది జనవరిలోనే సీఆర్డీఏ అధికారులు టెండర్లు పిలిచారు. ఫిబ్రవరిలోనే ఆ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమవుతాయని భావించినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడంతో జాప్యం జరిగింది. తాజాగా కోడ్‌ తొలగిపోవడంతో కాంట్రాక్టర్ల టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ బిడ్లను అధికారులు పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేస్తున్నారు. వాటికి సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ వెంటనే కాంట్రాక్టర్లతో ఎల్‌వోఏ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఈ నెలఖరుకల్లా కొన్ని పనులు, మిగిలినవి ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి. అయితే తాజా టెండర్లలో నాలుగు పనులకు ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదని అధికారులు చెబుతున్నారు. గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్ల భవన సముదాయాల పనులకు పిలిచిన టెండర్లకు ఎవరూ స్పందించకపోవడంతో, మళ్లీ కొత్త టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?


అంతర్గత రహదారుల్లో జోరు
రాజధాని నిర్మాణంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన పనుల్లోనూ కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. అమరావతిలో అసంపూర్తిగా ఉండిపోయిన ఈ-2, ఈ-4, ఈ-5, ఈ-7 ఈ-11, ఈ-13, ఈ-15, ఎన్‌8, ఎన్‌13 రహదారుల నిర్మాణానికి రూ.2,903.76 కోట్లతో అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌) ఫిబ్రవరి 15న బిడ్లను ఆహ్వనించింది. వాటి గడువు ఈ నెల 3తో ముగిసింది. అదేరోజున బిడ్లను పరిశీలించి అర్హులను నిర్ణయించాల్సి ఉండగా, కోడ్‌ కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. కోడ్‌ ముగియడంతో ఆ పనులూ ఈ వారంలో ప్రారంభం కానున్నాయి.
అసెంబ్లీ, హైకోర్టు టెండర్లకు 17వరకే గడువు
రాజధాని అమరావతి గుండెకాయగా ఉండే శాసనసభ, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణ పనులకు ప్రభుత్వం వారం క్రితమే టెండర్లను ఆహ్వానించింది. రూ.1,816కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి టెండర్ల గడువు 17తో ముగియనుంది. అదేరోజు సాయంత్రం బిడ్లను తెరిచి ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు. ఆ పనులు కూడా మార్చి మూడోవారం నుంచే పరుగులు పెట్టనున్నాయి. 2018లో టీడీపీ హయాంలో అసెంబ్లీ భవనానికి రూ.555కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఇప్పుడది రూ.768 కోట్లకు పెరిగిది. హైకోర్టు శాశ్వత భవనానికి అప్పట్లో రూ.860 కోట్ల వ్యయాన్ని అంచనా వేయగా, ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు రూ.1,048 కోట్లకు చేరింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #amaravathi #constructions #tenders #todaynews #flashnews #latestnews